కరోనా సోకి మరణించేవారి కంటే ఆ వ్యాధిపట్ల పుకార్లుతో, ఆందోళనలతో భయంతోనే కాలం గడిపే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. కొన్ని రోజుల కిందట ఇటువంటి పుకార్లు ఎక్కువగా రావటం, ఇందుకు సోషల్ మీడియా కూడా అగ్గికి ఆజ్యం పోసింది.
గతంలో ఫలానా డాక్టర్ కు కరోనా సోకిందని జరిగిన ప్రచారానికి ఆడాక్టర్ స్వయంగా వివరణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇటువంటి ప్రచారాలతో ఆ డాక్టర్ కుటుంబం ఎంతటి క్షోభ అనుభవించారో వారికే తెలుస్తుంది.వాస్తవంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమానుల ఇళ్ల వద్దకు అధికారులు వెళ్లి పరీక్షలు నిర్వహించటం, ముందస్తు జాగ్రత్తలు నిర్వహించటం జరుగుతున్న తతంగమే. అలా గని వారికి కరోనా పాజిటివ్ ధృవీకరణ అయ్యినట్లు కాదు. ప్రభుత్వం నిర్దారించి, ధృవీకరణ చేసిన అనంతరమే కరోనా సోకినట్లు నిర్ధారించాల్సి ఉంటుంది. కాని ఇందుకు విరుద్దంగా ప్రభుత్వం ధ్రువీకరణ చేయకుండానే కరోనా గురించి ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఈ కథనం పోస్టు చేసే సమయానికి ఇంతవరకు ఒక్క కేసు కూడా చిలకలూరిపేటలో నమోదు కాలేదు. ఒకవేళ కరోనా పాజిటివ్ నమోదు అయినా ఇందుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి.
కరోనాకు సంబంధించి ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయకండి. కరోనా నిర్దారణ వ్యక్తుల వివరాలు , ఫోటోలు షేర్ చేయకండీ , కేసులలో ఇరుక్కొని ఇబ్బంది పడకండి. సాధ్యమైనంత వరకు ఇలాంటి ఫేక్ మెసేజ్ లు ఫార్వర్డ్ చేయకండి.ఫేక్ మేసేజ్ లు షేర్ చేయడం ద్వారా కూడా క్రిమినల్ కేసులలో ఇకుక్కునే అవకాశం ఉంది.సాధ్యమైనంత వరకు ప్రతి మెసేజ్ ని సాధ్యమైనంత వరకు పరిశీలించండి.


Post A Comment:
0 comments: