ఎన్నోన్నో కలలతో విదేశాలకు వెళ్లిన విద్యార్దులకు కరోనా శాపంలా మారింది. ఊరుగాని ఊరు. దేశం కాని దేశంలో భయాందోళలతో కాలం విద్యార్దులు కాలం గడుపుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ వారు ఎలా ఉన్నారో అన్న ఆందోళన స్థానిక వాసులను కలచి వేస్తుండగా, తమ స్వస్థలంలో బంధువులు, తల్లి దండ్రులు ఎలా ఉన్నారో అందోళనలో అక్కడి వారు ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్య విషయమేమిటంటే అక్కడి పరిస్థితులతో పోల్చి చూసుకుంటే లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భారతదేశమే చాలావరకు మెరుగ్గా ఉంది.
ఈ క్రమంలో చిలకలూరిపేట పట్టణ వ్యాస్థవ్యుడు షేక్ మొహమ్మద్ ఉన్నత చదువుల కోసం రెండు సంవత్సరాల కిందట ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడి యూనివర్శిటిలో ఎంఎస్ చేస్తున్న మొహమ్మద్ అక్కడి అక్కడి పరిస్థితి గురించి చిలకలూరిపేటన్యూస్‌తో పంచుకున్నారు. ఆతని మాటల్లోనే లండన్‌లోని పరిస్థితి తెలుసుకుందాం.
ప్రతి రోజు కరోనా వార్తలతోనే తెల్లారుతుంది. ముందుగా మేము ఉంటున్న ప్రాంతం ఎలా ఉంది... ? ఎన్ని కేసులు పెరిగాయి.. పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం చూస్తాం. అనంతరం ఇండియా, మా ప్రాంతం చిలకలూరిపేట ఎలా ఉందన్న విషయం తెలుసుకుంటాం. ప్రతి రోజు అమ్మా,నాన్న కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌తో మాట్లాడుకుంటాం. భారత దేశంతో పోల్చి చూసుకుంటే ఇక్కడ లాక్‌డౌన్ ఉన్నట్లే లేదు. ఒకవైపు కేసులు పెరుగుతున్నా లండన్‌లో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించటం లేదు. పేరుకు సెప్టెంబర్ వరకు లాక్‌డౌన్ ప్రభుత్వం ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజలు మాస్కులు, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా యద్దేచ్చగా రోడ్లపై తిరుగుతునే ఉన్నారు. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా లండన్‌లో ఉన్న మన వాళ్లు కొంతమేర జాగ్రత్తగా ఉంటున్నారు. మేము ఉంటున్న లండన్ కన్నా ఇండియాలోనే పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పట్లో ఇండియా వచ్చే అవకాశం కనిపించటం లేదు.

Post A Comment:
0 comments: