పేట అనే పేరు వినగానే మన ప్రాంతా వాసులు చిలకలూరిపేటగా , పల్నాడు ప్రాంత వాసులు నరసరావుపేటగా అర్ధం చేసుకుంటారు. పేరులోనే కాదు అనేక అంశాల్లో ఈ గ్రామాల మధ్య అనేక సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నరసరావుపేట వాసులు కష్టకాలంలో ఉన్నారు. కరోనా అక్కడ ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
చిలకలూరిపేటకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న నరసరావుపేటతో ప్రతి దినం మన ప్రాంతవాసులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఈ ప్రాంతాలు తమవే అన్న విధంగా తిరుగుతుంటారు. గతం మాట అటుంచితే కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఈ పరిస్థితుల్లో నరసరావుపేట కరోనా కేసుల వ్యాప్తి సహజంగానే చిలకలూరిపేట ప్రాంత ప్రజల్లోనూ అలజడి సృష్టించాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క కరోనా కేసు లేదని ధీమాగా ఉన్న సందర్బంలో నరసరావుపేటలో కరోనా కేసులు ఆందోళనకు కారణమౌతున్నాయి.
నరసరావుపేటకు మన నియోజకవర్గంలోని నాదెండ్ల, చిలకలూరిపేట మండలాలు సరిహద్దు ప్రాంతాలు.అటు నాదెండ్ల పరిధిలో సాతులూరు, కనపర్రు, ఇటు కట్టుబడివారి పాలెం దాటితే నరసరావుపేట నియోజకవర్గం ప్రారంభమౌతుంది. వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు కొనసాగుతాయి. అసుపత్రులు, నిత్యావసరాల కొనుగోళ్లు వరకు ఆయా ప్రాంతాల ప్రజలు తమకు సమీపాన ఉన్న నరసరావుపేట పైనే ఆధారపడతారు.
ఇప్పటికే అధికారులు చిలకలూరిపేట-నరసరావుపేట మధ్య రాకపోకలు నిషేదించారు. బారికేడ్లతో దారులు మూసివేశారు. అయితే ఇప్పుడు కావల్సింది అధికారుల అప్రమత్తత కన్నా ప్రజల్లో చైతన్యం. ఈ విపత్కర పరిస్థితుల్లో కొన్ని రోజులు నరసరావుపేటకు ప్రయాణాలు మానుకోవటమే ఉత్తమం. ఏ ఒక్కరు చేసిన తప్పు మన ప్రాంతాలకు శాపంగా మారకూడదు. కరోనా మనదాక రాదన్న ధీమా గాని, అంతా అయిపోంతుందన్న ఆందోళన కూడా అవసరం లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా అనవసర ప్రయాణాలు మానుకొని ఇంటికే పరిమితమౌద్దాం. చిలకలూరిపేట ను కరోనా లేని గ్రీన్‌జోన్‌గా కొనసాగిద్దాం. అప్రమత్తంగా మెలిగి .. బాధ్యతగా కరోనాపై సమయం సాగిద్దాం..

Post A Comment:
0 comments: