పై వార్త చదివారు కదా.. మీకు ఏమనిపిస్తుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో జరిగిన సంఘటన ఇది. ఏ ప్రయత్నమైనా ప్ర్రాణాలు నిలిపిదిలా ఉండాలి. ఏ చర్యలు ప్రాణాలు తీసిదిలా ఉండకూడదు. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే. కరోనా వ్యాప్తిస్తుందన్న భయాందోళనలు ప్రాణాల మీదకు తెస్తుంది. కరోనా కట్టడి కోసం ప్రజలు తీసుకుంటున్న స్వయం నిర్ణయాలు అత్యవసర సేవలకు విఘాతం కలిగిస్తున్నాయి. ప్రధానంగా రోడ్లకు అడ్డంగా కంచెలు, ముళ్ల కంపలు, ఎడ్లబండ్లు, చెట్లు, బండరాళ్లు వంటివి పెట్టి రాకపోకలకు అంతరాయం కలిగించడం ఆపత్కాలంలో ఆసుపత్రులకు వెళ్లేవారికి శాపంగా మారుతున్నాయి. కరోనా కట్టడి కోసం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ రోడ్ల దిగ్బంధన చర్యలు ఆసుపత్రులకు వెళ్లే వారికి అడ్డంకిగా మారుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ కొనసాగుతోంది. పలు గ్రామాలు, వీధుల్లో రాకపోకలు నిలిచేలా ప్రజలు రహదారులను మూసివేశారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణంలోని పలు వీధులతో పాటు సగం గ్రామాల రోడ్లను దిగ్బంధనం చేసి ఇతరులెవరూ రాకుండా చూస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న గ్రామస్థులు ఆ రహదారులను మూసివేసే దిశగా ముళ్లకంచెలు, చెట్లు, ఇతర వాహనాలు అడ్డంగా పెట్టడమే అత్యవసరసేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. రహదారులపై కంచెలు ఏర్పాటు చేయడం ఆయా గ్రామాల వారు ఆసుపత్రి కోసం వెళ్లే క్రమంలో నానా ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందులు పడుతున్నామని ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా గ్రామాలకు కూరగాయాలు, నిత్యావసర సరకులు తరలించాలన్నా.. అధికారులు ఆయా గ్రామాలకు పర్యవేక్షణకు వెళ్లాలన్నా గ్రామస్థుల కట్టడి చర్యలు అడ్డంకిని తెచ్చిపెడుతున్నాయి. దీని వల్ల ఎమర్జెన్సీ సర్వీస్, అంబులెన్స్, పోలీస్ ,పాలు, అగ్నిమాపక వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదైనా జబ్బుతో, పురిటి నొప్పులో, హార్ట్ ఎటాక్ తో ఊర్లోని ఎవరికైనా వస్తే మీ ఇంటికి 108 వాహనాలు రాత్రిళ్ళు , పగలు ఈ వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది, సమయం చాలక ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది.
పట్టణ ప్రాంతంలోనూ ఇదే తంతు కొనసాగుతుంది. పోలీసులు, అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని శివాలయం వీధిలో పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. పట్టణంలోని మరికొన్ని ప్రాంతాలలో రాత్రి పూట సంచారం లేకుండా రోడ్లను మూసివేస్తున్నారు. ఇలా అధికారులు దారులు మూసివేసే క్రమంలో అత్యవసర సమయాల్లో బయటకు రావటానికి ఎంపిక చేస్తారు. కాని ఆ మార్గాలను కూడా మూసివేస్తే..పరిస్థితి ఎంతటి దుర్బరంగా ఉంటుందో అలోచించండి. వైద్యచికిత్సలో ప్రతి నిమిషం విలువైందే. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పిలుస్తారు. ఆ సమయానికి వారికి వైద్యసేవలు అందిస్తే ప్రాణం నిలబడుతుంది...లేదంటే ప్రాణం పోతుంది. ప్రాణం పోద్దామా.. ప్రాణాలు తీద్దామా.. మానవత్వంతో ఆలోచించండి...


Post A Comment:
0 comments: