లాక్‌డౌన్ తో అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడింది. ఈ వర్గాల్లో బతుకుతెరువు కోసం ఉపాధ్యాయవృత్తిని చేపట్టిన ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులపై ఈ ప్రభావం తీవ్రంగానే ఉంది. అసలే తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగాలు. పనిచేసే నెలకే అంతంత మాత్రంగా ఇచ్చే జీతాలు లాక్‌డౌన్‌తో పాఠశాలలు, విద్యాసంస్థలు మూత పడటంతో వీరి జీవితం మరింత దయనీయంగా మారింది. వారి జీవితాలు, వారు అనుభవిస్తున్న కష్టాలపై పేరు చెప్పుకోవటానికి ఇష్టపడని ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు అందిస్తున్న కథనం ఇది. ..
బతకలేక బడిపంతులు అనే మాట ప్రవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సరిగ్గా సరిపోతుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటుంది వీరి వ్యవహారం. కక్కలేరు మింగ లేరు. వీరికి ఇచ్చేది అరకొర జీతాలు. ఈ జీతాల్లో మళ్లీ కోతలు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా వీరి బతుకులు మారవు. విద్యార్థులందరికీ విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లే వీరి కష్టాలు ఎవరూ వినరు. ఒకవేళ అధికారులు విన్న ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం వీరికి సెలవు రోజుల్లోనూ జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన ఇంకా వాటిని అమలు చేయడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చట్టం ప్రకారం వచ్చే లాభాల్లో 50 శాతం ఉపాధ్యాయుల జీతలకు ఖర్చు పెట్టాలి. ఇది ఏ పాఠశాల అనుసరించడం లేదు. విద్యార్థులు పలు అంశాలలో వేసే ప్రశ్నలకు వీరి వద్ద సమాధానాలు ఉంటాయి కానీ, వీరి సమస్యలకు పరిష్కార మార్గాలు మాత్రం ఉండవా? అంటే ఉంటాయి కానీ,వాటి గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోరు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో 17 స్కూల్లో ఒక శాఖతో మాత్రమే నడవగా, మూడు పాఠశాలలు రెండు శాఖలుగా, మరో రెండు పాఠశాలలు కొత్త తరహా విద్యను బోధిస్తున్న మని అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవే కాక పట్టణ స్థాయిలో 4 జూనియర్ , రెండు కార్పొరేట్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్ననాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పట్టణ పరిధిలో నాలుగు పనిచేస్తున్నాయి. పాఠశాల స్థాయిలో మూడు కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక కళాశాల ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చెప్పగా మరొక కళాశాలలో డిగ్రీ మాత్రమే బోధిస్తున్నారు. ఈ కళాశాలలో కూడా దాదాపుగా ప్రైవేటు అధ్యాపకులుగా పని చేస్తున్న వారు సుమారుగా ఉన్నారు. విద్యా సంస్థలో దాదాపు 2000 మంది ఉపాధ్యాయ సిబ్బంది, 500 మంది ఉపాధ్యాయతర సిబ్బంది పని చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ఏప్రిల్ 27వ తేదీ నాటికి కూడా రెండు కళాశాలలు మార్చి నెల జీతాలు ఇవ్వకుండా ప్రైవేట్ ఉపాధ్యాయుల, అధ్యాపకుల లను వేధిస్తున్నారు. పట్టణ స్థాయిలో రెండు పాఠశాలలు మార్చి నెలకు సంబంధించి పూర్తిగా జీతాలు ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సంస్థలకు లాక్ డౌన్ విధిస్తూ ప్రైవేటు సంస్థలలో పనిచేసే సిబ్బందిని లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించమని, వారిని ఉద్యోగం నుండి తొలగించవద్దు అని ఆదేశించడం జరిగినప్పటికీ పట్టణ స్థాయిలో, జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జీతాలు చెల్లించాల్సి వస్తుందని సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ ఇతర సిబ్బంది అయోమయ స్థితిలో పడ్డారు. కుటుంబ పోషణ కోసం నానా అవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు,ఉపాధ్యాయ ఇతర సిబ్బంది విలవిలలాడుతున్నారు. చాలా మంది సిబ్బంది ఇతర పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఉన్నారు. మన సమాజంలో ఉపాధ్యాయులకు పూజనీయమైన స్థానం ఉందని, అలాంటి ఉపాధ్యాయులకు ఏమాత్రం గౌరవించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారు. కొన్ని వేల మంది కష్టాన్ని గురించి నిబంధనల ప్రకారం వారికి కల్పించవలసిన అన్ని హక్కులను యాజమాన్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
1897 apedemic డిసీజ్ act కింద ఏప్రిల్ మరియు మే నెల జీతాలు ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే విధముగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. లేనిపక్షంలో వాళ్ళ జీవితాలు అయోమయ స్థితిలో పడే అవకాశం ఉంది. నిన్నటికి నిన్న ఆదివారం రాష్ట్ర పాఠశాల విద్య ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించిన జీతభత్యాలు, బయోడేటా, బ్యాంకు శాలరీ విశేషాలు కోరటం గమనార్హం! దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కడ జీతభత్యాల వివరాలు తెలుస్తాయి అన్న ఉద్దేశంతో ఒక పిటిషన్ను ఏర్పాటు వేయ డానికి పూనుకుంటున్నారు. ప్రవేట్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు,ఉపాధ్యాయ తర సిబ్బందికి క్యాంపెయిన్ విధుల నుంచి బహిష్కరించే విధముగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి. ఉపాధ్యాయులు తప్పనిసరిగా తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి.

Post A Comment:
0 comments: