ప్రచారం లేదు.. ఎటువంటి ఆర్బాటం లేదు. కరోనా లాక్‌డౌన్ వేళ నిర్మానుష వాతావరణంలో నిరంతరంగా, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకోపోతున్నాడతను. ఎదుటి వ్యక్తి ఆనందంలో తన ఆనందం చూసుకొనే ఇతనికి ప్రజల కష్టం, దుఖం, కన్నీళ్లు చూసి చలించి పోయాడు. వారి కష్టాలు తనవిగా భావించాడు. నిరంతరంగా శ్రమిస్తూ ప్రతి రోజూ కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్తులకు తానున్నాన్న విశ్వాసం కల్పించారు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు. ఏకంగా వరసగా ఇప్పటికి 8 రోజుల నుంచి అతని సేవా ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అతనే చిలకలూరిపేటకు చెందిన ఆరా మస్తాన్. తన సంస్థ పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న మస్తాన్ తాను పుట్టిపెరిగిన నియోజకవర్గ ప్రజలు కరోనా దెబ్బకు ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి అపన్నహస్తం అందిస్తున్నారు.
లాక్‌డౌన్ లో ప్రారంభం కావటంతోనే కరోనా వ్యాధి పట్ల చిలకలూరిపేట ప్రజలకు అవగాహన అవసరమని గుర్తించి సొంతవాహనాలు సమకూర్చి ఆరా మస్తాన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో మైక్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. కరోనా వ్యాప్తి, తీసుకోవల్సిన జాగ్రత్తలుపై అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం నింపారు. అయితే లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన చిరువ్యాపారులకు, పేదలకు మాటలతో కడుపు నిండదని భావించి వారి అవసరాలను తీర్చటానికి పూనుకున్నారు.
రాష్ట్ర, దేశ రాజకీయాలల్లో ఖచ్చితత్వానికి, విశ్వసనీయతకు పెట్టింది పేరు ఆరా చేపట్టిన ఎన్నికల సర్వేలు. ఈ సంస్థ యజమాని షేక్ మస్తాన్‌వలి స్వగ్రామం చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి , అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అతను.ఎదిగే కొద్ది ఒడిగి ఉండాలన్న పెద్దల మాటకు ఆరా మస్తాన్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందంజలో నిలుస్తారు. చదువు కొన్న పాఠశాలను లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ది చేయటంలోనూ మస్తాన్ ముందంజలో నిలిచారు. కోటప్పకొండ తిరునాళ్ల భక్తుల సేవలలోనూ, పొతవరం అబ్దుల్లాబాషా ఉరుసులో ఏటా అన్నదానం చేయటం, విద్యా సంబంధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం ఆరా మస్తాన్‌కు ఇష్టమైన వ్యాపకాలు. విద్యారంగంలో రావలల్సిన మార్పుల గురించి నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన మౌలానా అబ్దుల్‌కలాం అజాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు.



Post A Comment:
0 comments: