మొదలైన ఫైనాన్స్‌ర్ల బెదిరింపులు ..మధ్యతరగతి మౌన వేదన...
లాక్‌డౌన్ నేపథ్యంలో మధ్యతరగతి, పేదలకు ఊరట కలిగిస్తూ మూడు నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించింధన్న వార్త విని అనేక మంది ఆనందపడ్డారు. కేంద్రప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆనందపడ్డారు. హమ్మయ్య.. ఉన్న డబ్బులతో కష్టకాలంలో కిస్తీలు కట్టకుండా నిత్యావసరాలకు ఉపయోగపడుతుందని ఆశించారు. వారి ఆశలు అడియాశలే అయ్యాయి. బ్యాంకులో ఉన్న డబ్బులు తెలియకుండానే కట్ అయిపోయాయి. డబ్బులు చెల్లించని వారికి చెక్కులు బౌన్స్‌లు అయ్యాయని మెసెజ్‌లు వచ్చాయి. ఇక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, వ్యక్తులు మా డబ్బులు వడ్డీతో సహా ఇప్పుడే కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారు.
అవసరాలు పెరుగుతుంటాయి. అనుకోని ఆపదలు భయపెడుతుంటాయి. ఏదైనా అవసరం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే అక్కడ ఏలాగో రుణం పుట్టదు. దాని కోసం ఇళ్లలో వస్తువులను కొనుగోలు చేయటానికి చెక్‌లు ఇచ్చి వాహనమో, లేదా ఇంటికి ఉపమోగ పడే మరోదో వస్తువులు తీసుకొన్నవారికి ఇప్పడు చుక్కలు కనబడుతున్నాయి. ఆర్‌బీఐ మానిటోరియంతో సంబంధం లేదని వడ్డీ, చెక్కు బౌన్స్‌తో మొత్తం కట్టాలని ఫోన్లు భయపెడుతున్నాయి. అనేక ఆటోలు, లారీలు, ఇతర రవాణా వాహనాలు ఫైనాన్స్‌మీదే నడుస్తున్న మాట వాస్తవం. లాక్‌డౌన్‌తో ఇవి ఆగిపోవటం, రోజు గడవటమే కష్టంగా ఉన్న వారికి వాహనాలు జప్తు చేస్తు డబ్బులు చెల్లించటం ఆలశ్యం కావటంతో బెదిరింపులకు దిగుతున్నారు. ఇవి ఇలా ఉండగా కొన్ని సంస్థలు ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకొన్న వారికి చిన్న మొత్తాల్లో అధిక వడ్డీకి కేవలం పాన్,ఆధార్ కార్డులో లోన్లు ఇచ్చాయి. ఇలా లోన్లు ఇచ్చే క్రమంలోనే లోన్ పొందే వ్యక్తి ఫోన్లలోని కాంటాక్టులు, ఫోటోలు, సమస్తం వారు వినియోగించుకోవటానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అనుమతి లోన్లు పొందిన వారికి పరిస్తితి మరీదారుణంగా తయారైంది. వివిధ నంబర్లతో బెదిరింపు ఫోన్లు, మెసెజ్‌లు రావటంతో వారు హడలిపోతున్నారు.
నెల ప్రారంభం కావటం ఆలశ్యం నెల వాయిదాలు గుర్తుకు వస్తుంటాయి. కొత్త అప్పుల కోసం కళ్లు వెతుకుతుంటాయి. సంపాదనకు రెండు మూడు రెట్లు ఖర్చు చేస్తున్నా.. ఏదో మూలన మనసులో ఆందోళన ఉన్నా.. పైకి గంభీరంగా కనిపిస్తుంటారు. అన్నింటినీ పంటి బిగువున భరిస్తూ జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. కరోనా మహమ్మారి దైనందిన జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో పరిశ్రమలు, సంస్థలు, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలు స్తంభించాయి. చిరు వ్యాపారాలు, ఉద్యోగాలను నమ్ముకున్న మధ్య తరగతి కుటుంబాలు అయోమయంలో పడ్డాయి.ఈ క్రమంలో ఆర్‌బీఐ మారిటోరియం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఆర్‌బీఐ మారిటోరియంలో గందళగోళం ఉంది. కిస్తీ డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటే వారు వారు అప్పు తీసుకొన్న బ్యాంకు, ఫైనాన్స్ సంస్థకు ఆన్‌లైన్‌లో లేఖ పంపాల్సి ఉంటుంది. లేఖ అంతా ఇంగ్లీషులో ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దీన్ని సంబంధిత బ్యాంకు, ఫైన్సాన్స్ సంస్థ అంగీకరించాలి. ఇదంతా నిరక్ష రాస్యులకు తెలియదు. ఒకవేళ్ల చచ్చిచెడి లేఖ పంపినా వాటిని ఆమోదించటం కష్టమే. ఇదంతా ఆర్ బీఐ ప్రకటించిన మారిటోరియంలోని లోగుట్టు.
లాక్‌డౌన్ పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, ఇంట్లో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నచోట కన్నీటిని దిగమింగుతూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఎంత పొదుపుగా ఇంటిని నడుపుదామన్నా.. నెల రోజులకుపైగా పనిలేక కనీస ఆదాయం లేక అప్పటి వరకు దాచుకున్న సొమ్ము కరిగిపోతోంది. ఈ క్రమంలో అప్పులోళ్ల బెదిరింపులతో సతమతమౌతున్నారు
.



Post A Comment:
0 comments: