విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడే విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవ‌టానికి ఒక్క‌టై నిల‌వాలి. ఈ క్ర‌మంలో పార్టీలు, వ‌ర్గాలు, కులాలు, మ‌తాలు ఇలా మ‌నిషిని విడ‌దీసే ఏ వ్య‌వ‌హార‌మైనా అందుకు దూరంగా ఉండాలి. మ‌న సంఘ‌టిత శ‌క్తి ముందు క‌రోనా కాదు ఇంత‌కు మించి ఏ విప‌త్తు యైనా మ‌న ముందు త‌ల‌వంచాల్సిందే. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది అదే. విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధి, అధికారులు విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశారు.  ప్ర‌భుత్వం తీసుకొన్న ఆదేశాల ప్ర‌కారం లాక్‌డౌన్‌ను తూచ త‌ప్ప‌కుండా పాటించారు. ఇప్పుడు చిల‌క‌లూరిపేట మ‌రికొన్ని రోజుల్లో ప‌రిస్థితి ఇలాగే ఉంటే గ్రీన్ జోన్‌గా మార‌బోతుంది. 
దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులోకి వ‌చ్చిన‌ప్ప‌టి క‌ష్టాలు ఉన్నా, ఇబ్బందులు ప‌డ్డా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించారు. అత్య‌ధిక మంది ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా వ్యాప్తి లేన‌ట్లే అని భావిస్తున్న స‌మ‌యంలో యువ‌వైద్యురాలు కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించి క‌రోనా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రే ఇత‌ర క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కాకుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఒక‌టి కి రెండు సార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వేలాది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించినా ఎక్క‌డా పాజిటివ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌టంతో అంతా ఊప‌రిపీల్చికున్నారు. 

క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వైద్యురాలు కూడా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, ప‌క్క‌నే ఉన్న న‌ర‌స‌రావుపేట‌లోనూ క‌రోనా విజృంబిస్తున్న స‌మ‌యంలో మ‌న చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క కేసుతోనే స‌మ‌సి పోవ‌టం వెనుక అధికారుల కృషి, వారి నిద్ర‌లేని రాత్రుల త్యాగం దాగి ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌టం, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం,  ఇందుకు పేట ప్ర‌జ‌ల స‌హ‌కారం క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు దోహ‌ద‌ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వం సూచించిన విధంగా మ‌రికొన్ని రోజులు ఓపిక ప‌డితే నియోజ‌క‌వ‌ర్గంలో య‌ధావిధిగా ప్ర‌జా జీవ‌నం కొన‌సాగే అవ‌కాశం ఉంది. చిల‌క‌లూరిపేట‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా సాధించిన విజ‌యం ప్ర‌జాప్ర‌తినిధి, అధికారులు, ప్ర‌జ‌లంద‌రిది. 

Axact

చిలకలూరిపేట న్యూస్

నిజం.. నిష్పక్షపాతం మా నైజం నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన విశ్లేషణల కోసం

Post A Comment:

0 comments: