చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌లో ఒక్క పాజిటివ్ కేసుతో మొదలయిన కరోనా నేడు వాడవాడలా విస్తరిస్తుంది. పట్టణంతో పాటు మారుమూల పల్లెలను సైతం కరోనా వదలటంలేదు. పట్టణంలో యువ వైద్యురాలితో మొదలైన కరోనా పరంపర నేడు తామరతంపరగా కొనసాగుతుంది. ఒక్కప్పుడు ఒక్కకేసుతో సమసి పోతుందని భావించిన పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. అయితే ప్రభుత్వం అత్యదిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించటం హర్షించదగ్గ విషయం.
సడలింపుల తర్వాతే...
ఒక్క కరోనా కేసు నమోదైతే పట్టణంలోని కళామందిర్ సెంటర్, పరిసరప్రాంతాలను అష్టదిగ్బంధం చేసిన అధికారులు ప్రభుత్వ సడలింపుల తర్వాత పరిస్థితి మారిపోయింది. కంటోన్మెంట్ పరిది కుదింపు, సడలింపులు ప్రజల విచ్చలవిడి తనానికి దారి తీసాయని చెప్పవచ్చు. గతంలో మాదిరి ఒకవైపు అధికార యంత్రాంగం పట్టింపు లేకపోవడం, మరో వైపు ప్రజల విచ్చలవిడితనం వెరసి పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నెలలో, వారంలో ఒక కేసు నమోదయ్యే పరిస్థితులు మారిపోయాయి. ఒక్క రోజే ఆరునుంచి ఎనిమిది కేసుల వరకు నమోదయ్యే పరిస్థితి నెలకొంది. బాధితుల్లో ప్రధానంగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులే ఉన్నారు. వీరిని త్వరితగతిన గుర్తిస్తున్న అధికారులు హోం క్వారంటైన్ చేస్తున్నారు
మనల్ని మనం కాపాడుకునే సమయం ఇదే...
‘లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మనల్ని మనం కాపాడుకునే సమయం ఇది. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చుట్టుపక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. కోవిడ్ పాజిటివ్ ఉన్న ఎవరైనా మీకు దగ్గరగా వచ్చినా అలర్ట్ చేస్తుంది. ఆరోగ్య భద్రత, అత్యవసర సేవలను సులభంగా పొందొచ్చు. అందరం భద్రతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి’’ అని ఇటీవల సినీ హిరో మహేష్ చేసిన వ్యాఖ్యలు అచరణీయం.

Post A Comment:
0 comments: