పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ వద్ద సెల్‌లైటింగ్ నగదు డ్రాచేసుకుంటున్న వినియోగదారుడు
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ వాటి నిర్వహణలో మాత్రం డొల్లతనం కనిపిస్తోంది. చిలకలూరిపేట పట్టణంలో అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలు ఏర్పాటు చేసుకున్నాయి. కాని వాటి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వినియోగదారుల పాలిట ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
పట్టణంలో ఉన్న కొన్ని ఏటీఎంలలో ఏసీలు పనిచేయవు. కొన్నింటిలో బటన్లు,టచ్ స్కీన్ పనిచేయదు. విచిత్రమేమిటంటే పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ ఐటీఎంలో రాత్రి పూట కనీసం లైట్లు కూడా పనిచేయవు. సెల్‌టార్జ్‌తో లావాదేవిలు ముగించుకోవాల్సిన దుస్థితి. బ్యాంకుల నిర్లక్ష్య వైఖరిపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. కనీస వసతులను కూడా సమకూర్చకుండా ఏటీఎంలను ఏర్పాటు చేసి వదిలేస్తుండడంతో బ్యాంకర్ల తీరుపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.నిబంధనల ప్రకారం ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించి తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.కొన్ని ఏటీఎంల వద్ద వారు కూడా ఉండటంలేదు.
ఏటీఎంలలో నిక్షిప్తమై ఉండే రహస్య కెమెరాలు ఏటీఎంను కదిలించడానికి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే సైరన్ మోగి బ్యాంకు అధికారి, ఏంటీఎం నిర్వహణ బాధ్యతలు చూసే వ్యక్తికి, సదరు పోలీసు అధికారులకు సమాచారం చేరడం లాంటి వ్యవస్థ ఉండాలి. అదే సమయంలో ఏటీఎంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నా హెల్మెట్ ధరించి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసినా అలర్ట్ చేసే వ్యవస్థ తప్పనిసరి. ఇవి ఎన్ని ఏటీఎంలలో ఉన్నాయో..లేవో తేలియని పరిస్థితి.
వివిధ పేర్లతో వినియోగదారులపై ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంకులు వసతుల కల్పనలో విపలమౌతున్నాయి. పట్టణంలో ఉన్న ఏటీఎంల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని, చిన్న చిన్న లోపాలను సరిచేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Post A Comment:
0 comments: