15 సంవత్సరాల కిందట మిత్రులు ఇరువురు స్టూటర్‌పై వెళుతూ గణపవరం వద్ద జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. వారికి చిన్న చిన్న గాయాలు తప్ప చనిపోయే గాయాలు లేవు. పోస్టు మార్టం నివేదిక వచ్చింది. వారు చనిపోయిన కారణం తెలుసా.. భయం.. అవును భయంతో గుండె ఆగి చనిపోయారు.
రెండు రోజుల కిందట ఒక వృద్దుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్ వచ్చింది. సరిగ్గా అర్దం చేసుకొలేని అతను కరోనా సోకిందని చనిపోయాడు.
శుక్రవారం కడప ఎన్‌టీవీ విలేకరి మధుసూదన్ రెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ పూర్తి ఆరోగ్యంగా ఉండి కూడా భయంతోనే చనిపోయాడు.
కరోనా సోకిందని రోజూ రాష్ట్రంలో అనేక మంది భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పై సంఘటనలు చదివారు కదా.. ఏంమనిపిస్తుంది. ఇప్పుడు పోరాడాల్సింది కరోనాతో కాదు..భయంతో.. అవును భయమే మనిషిని కుంగదీస్తుంది.అనేక మంది ఇప్పుడు కరోనా భయంతోనే సతమతమౌతున్నారు. చిన్నపాటి జలుబు వచ్చినా, సీజనల్ జ్వరం వచ్చినా ఉలిక్కిపడుతున్నారు. తమకు కరోనా సోకిందేమో అని మదనపడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు అల్లొపతి, ఆయుర్వేదం,హోమియా వైద్యంలో సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. కషాయాలు తాగుతున్నారు.
కరోనా లక్ష ణాలు కనిపిస్తే.. ఇక, మరణానికి చేరువైనట్టే అనే ప్రచారం జోరుగాసాగుతోంది. అయితే, ఇలాంటి ప్రచారం కేవలం ప్రచారమే. కరోనా పెద్ద ముప్పేమీ కాదు. అలాగని దానిని అంటించుకోవడమూ సరికాదు. వైరస్ సోక కుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యం. వైరస్ సోకినంత మాత్రాన ప్రాణాలకు ప్రమాదం లేకపోగా.. దీనినుంచి బయట పడేందుకు చాలా అవకాశం ఉంది. ఇక, కరోనా వల్లే రోజు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయని భావించడం, భయపడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే.. అనేక రూపాల్లో నిత్యం అనేక మంది చనిపోతున్నారు. ప్రపంచంలో ఆత్మహత్యల కారణంగా వైరస్ భారిన పడి మృతి చెందిన వారికన్నా 28 రెట్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిని బట్టి కరోనాతో భయపడాల్సిన అవసరం ఏమీలేదు. కేవలం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలు.ఆ జాగ్రత్తలు పాటించి కరోనాని, కరోనా భయాన్ని జయిద్దాం రండి..



Post A Comment:
0 comments: