గత లాక్‌డౌన్ అనుభవాలను మరవక ముందే చిలకలూరిపేట పట్టణం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. గతంలో లాక్‌డౌన్ విధించినప్పుడు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే విధంగానే కేసులు నమోదయ్యాయి. ఎప్పుడైతే లాక్‌డౌన్ సడలింపు పేరుతో ప్రజలు రోడ్లమీదకు వచ్చారో ఈ సంఖ్య నియోజకవర్గంలో 300లకు చేరువకానుంది. ప్రస్తుతం పెరిగిన కేసులతో అప్పట్లో చేసిన ప్రయత్నాలన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయ్యాయి.
ఎందుకంత నిర్లక్ష్యం...
ఎందుకంత నిర్లక్ష్యం... ఎందుకంత నిర్భీతి కరోనా జడలు విప్పి విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో బయట తిరగొద్దని ప్రభుత్వం, అధికారులు ఎంత హెచ్చ రించినా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యంత్రాంగం తంటాలు పడుతుంటే పేట వాసులు ఏమాత్రం సహకారం అందించకుండా నిబం ధనలు ఉల్లంఘిస్తున్నారు. వైద్యులు, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది నిద్రాహారాలు మాని అహో రా త్రులు శ్రమిస్తున్నారు. అయితే . కరోనా విషయంలో ప్రజల నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యం.. కేసులు పెరగటానికి కారణంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలోనూ కరోనా కారణంగా పేట నియోజకవర్గం అతలాకుతలం కావటానికి కారణం.. ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకోవటమే.. స్వీయ నియంత్రణ లేకుంటే కరోనాను కంట్రోల్ చేయటం ఎంతమాత్రం సాధ్యం కాదన్న విషయం చాలా ఆలశ్యంగా తెలిసివస్తుంది.
ఇకనైనా మేల్కొండి..
కరోనా సోకటానికి పెద్దచిన్న తేడా లేదన్న విషయం నియోజకవర్గంలోని కేసులను పరిశీలిస్తే తెలుస్తోంది. వైద్యులు, పోలీసులు, విలేకర్లు,బ్యాంకు సిబ్బంది వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరికి కరోనా సోకింది.వ్యాధి సోకిన బాధితులతో కోవిడ్‌కేర్ సెంటర్ కిటకిటలాడుతుంది. ఇప్పటివరకు నియోజవర్గంలో మహమ్మారి అన్ని చోట్లకు వ్యాప్తి చెందింది. యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాలలోని గ్రామాలతో పాటు, మండల కేంద్రాలలోనూ, పట్టణంలోని వాడవాడలా ఈ వ్యాధి విజృబించింది. ఇటువంటి తరుణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా లాక్‌డౌన్ అనివార్యం అయ్యింది. తామరతంపరలా పెరుగుతున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు సంపూర్ణ లాక్‌డౌన్ ఈ నెల 31వ తేదీ వరకు విధించారు. ఇప్పటికి మించి పోయింది లేదు. మీరు, మీ కుటుంబం, సమాజం బాగుండాలంటే ఇంటికే పరిమితమవ్వండి.. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. ఇకనైనా మేల్కొండి.
.



Post A Comment:
0 comments: