కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే జనం గజ గజా వణికిపోతున్నారు. ఇప్పటికే రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే 50 కేసులు నమోదు కావటం విశేషం. విజృంభిస్తున్న కరోనాతో ఎవరివైపు చూసినా అనుమానమే.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ప్రజలు భయపడుతున్నారు. సీజనల్ జ్వరాలకు సైతం కరోనా లక్షణాలు ఆపాదించుకొని అనుమానిస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల వార్తల కన్నా ఇప్పుడు బాధితులకు ధైర్యం చెప్పటం, వారిలో ఆత్మవిశ్వాసం నింపటం, చైతన్యం కలిగించటం అవసరం.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సంపూర్ణలౌక్‌డౌన్ కొనసాగుతుంది. ఇప్పుడు పట్టణం జీవం లేని శవంలా ఉంది. స్మశాన నిశబ్దం రాజ్యమేలుతుంది. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు భయపెడుతున్నాయి. చికటి పడితే పూర్తిగా జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. టీ దుకాణాల వద్ద రాజకీయాలులేవు. కళామందిర్‌సెంటర్, ఎన్ఆర్‌టి సెంటర్‌లలో నిత్యం ప్రజలతో కళకళలాడే ప్రాంతాలు బోసిపోయాయి. శ్రావణ మాసం సందర్బంగా తెల్లవారు జాము నుంచే భక్తులతో రద్దీగా ఉండే దేవాలయాలలో అర్చకులే దర్శనమిస్తున్నారు. శుక్రవారం ముస్లింలు, ఆదివారం క్రైస్తవుల ప్రార్దనలు లేవు.
కరోనా బాధితులకు ధైర్యం చెప్పండి...
పలకరింపు మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి దోహదపడుతుంది...కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. కాని ఇప్పుడే కరోనా బాధితులకు..కరోనా అంటే భయపడేవారికి ఒక్క పలకలింపు అవసరం. ఒక్క భరోసా అవసరం. ఆ భరోసా మనం ఫోన్ చేసి మాట్లాడితే ఉపశమనం ఉంటుంది.గుండె నిండా ధైర్యంతో కరోనాతో పోరాడి తిరిగి వస్తారు. కరోనా బాధితులకు ఒక్క ఫోన్‌కాల్ ద్వారా ఆ భరోసా ఇవ్వలేమా... ? ఆలోచించండి..?

Post A Comment:
0 comments: