ఒక మనిషిని అభిమానించాలంటే ఆ మనిషి చేసిన త్యాగం అంతర్లీలంగా చేసిన త్యాగం దాగి ఉంటుంది. పది మంది ఒక వ్యక్తిని అనుసరిస్తున్నారంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి వారి కోసం నిలబడి ఉండాలి. ఒక మనిషిని నమ్మతున్నమంటే ఆ వ్యక్తి తాను తన కోసం కాకుండా ఇతరుల కోసం నిలబడి ఉండాలి. వారి కష్టాల్లో అండగా ఉండి, వారి కన్నీళ్లు తుడిసి భరోసా అందించాలి. చిలకలూరిపేట నియోజకవర్గంలో అటువంటి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్. పార్టీలు, పదవులు, అధికారం ఏవీ ఆయనను తాను నమ్ముకున్న ప్రజల నుంచి, అబిమానులు, కార్యకర్తల నుంచి దూరం చేయలేదు.
కొంతమందికి రాజకీయం వ్యాపారం. కొంతమందికి రాజకీయం ఒక నటన. కాని మర్రిరాజశేఖర్‌కు మాత్రం రాజకీయాలు ప్రజలకు సేవ చేయటానికి లభించిన అవకాశంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. నియోజకవర్గంలోని వేలాది మందిని పేరు పెట్టే పిలిచే ఆపాయ్యత ఆయనది. ఎన్టీఆర్, వైఎస్సార్ , సోమేపల్లి సాంబయ్య లాంటి నాయకులను ఇప్పటికి తలుచుకుంటారు. సోమేపల్లి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మర్రిరాజశేఖర్ అంటే జనం. పేదల లాయర్‌గా అప్పటికే జనంలో ఉన్న ఆయన సోమేపల్లి వారసుడుగా రాజకీయాల్లో రమ్మని ఆహ్వానించింది ఆ ప్రజలే ఇండి పెండెంట్ అభ్యర్ధిగా రంగంలో దించారు. వారి ఆశలను వమ్ముచేయకుండా ఎమ్మెల్యేగా రాజశేఖర్ పేట ప్రజలకు చేరువయ్యారు. పదవులు ఉన్నా, లేకున్నా..అధికారంలో ఉన్నా లేకున్నా... రాజశేఖర్ మాత్రం ప్రజల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకోలేదు. సోమేపల్లి సన్నిహితులు వైఎస్సార్ అధికారంలో ఉన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయపడలేదు. నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటు పడ్డారు. నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, లోలెవల్ చాప్టాలు, పసుమర్రు, నరసరావుపేట, చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు మర్రి తో సాధ్యమైంది.
ఈ రోజు ఆయా పార్టీలలో నాయకులుగా చెలమణి అవుతున్న నాయకులను తీర్చిదిద్ది పదవులు ఇచ్చిన ఘనత మర్రిదే అన్న విషయం వారు మరచిపోయినా ప్రజలు మరిచిపోలేదు.రాజశేఖర్ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన జీవితంలో అత్యధిక భాగం ప్రజలతో గడిపిన వ్యక్తి. కుటుంబాన్ని త్యాగం చేసి ప్రజాసేవలోనే మునిగి పోయిన త్యాగధనుడు. . దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఒక్క బహిరంగ సభలో చెప్పిన మాటలే మర్రిరాజశేఖర్ మచ్చలేని వ్యక్తిత్వానికి, ప్రజల కోసం పరితపించిన విధానాన్ని స్పష్టం చేస్తుంది. .... మర్రిరాజశేఖర్ ప్రతి రోజు చెవిలో జోరిగలా సొదపెడుతుంటాడు. ఎప్పుడు తన నియోజకవర్గం గురించి, ఇక్కడి అభివృద్ది గురించే చెబుతుంటాడు. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఉండటం అధృష్టం ... మహానేత కితాబు చాలదా . మర్రిరాజశేఖర్ ఎలాంటి వాడో చెప్పటానికి ... మర్రిరాజశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలతో

Post A Comment:
0 comments: