కొన్ని జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల యవత్ భారత దేశ ప్రజలు శోకసంద్రంలో మునిగి ఉంటే చిలకలూరిపేటలో కూడా ఆయన స్మృతుల్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బాలసుబ్రమణ్యంతో పేట ప్రజలకు అనుబంధం ఉంది. ఒక్కసారి పరిచయం అయితే చాలు అయన్ని అంత త్వరగా మరిచిపోలేరు. ఆయనతో స్నేహం అలా కొనసాగాల్సిందే.
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో నటుడు, కళాకారుడు, టి కృష్ణమెమెరియల్ కళాపరిషత్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు దండా గోపి తన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు. ఇది ఆయన మాటల్లో..
1999 ఏప్రిల్14 తేదీ ఎస్సీ బాలసుబ్రమణ్యం చిలకలూరిపేట మండలం మిట్టపాలెంకు వచ్చారు. నేరుగా విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి మిట్టపాలెం కు వచ్చారు. సాయంత్రం నాటకాలు ప్రారంభానికి ముందే అంటే 6గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గ్రామంలోనే గడిపారు. నాటకాన్ని వీక్షించి, తన గానంతో అలరించారు. దీంతో పాటు నాటకం, దాని ప్రాశ్చత్యం గురించి అరుదైన ఉపన్యాసం ఇచ్చారు. అయనకు పాలసాలికలు ఇష్టం. ఈ సందర్బంగా జరిగిన విందులో వీటినే వడ్డిస్తే ఇష్టంగా తిన్నారు. అయనతో మాటలు సమయం తెలియదు. బాలసుబ్రమణ్యం గురువు కోదందపాణి వెండి విగ్రహాన్ని బహుకరిస్తే ఎంతో అప్యాయతతో స్వీకరించారు.
ఎస్పీ చరణ పరిచయానికి తొలివేదిక..
బాలసుబ్రమణ్యంతో పాటు ఆయన కుమారుడు చరణ్ కూడా మిట్టపాలెం గ్రామానికి వచ్చారు. ఇదే వేదిక నుంచే తన కుమారుడు చరణ్‌కు ప్రజలకు పరిచయం చేస్తూ తాను సినీ నేపధ్య గాయకుడిగా కొనసాగనున్నాడని తెలిపారు. మిట్టపాలెం వేదిక నుంచే తాను తన కుమారుడిని పరిచయం చేస్తున్నట్లు, తన లాగే తన చరణ్‌ను ఆదరించి ఆశ్వీర్వదించాలని కోరారు.
కొనసాగిన సంబంధాలు..
అప్పటి నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యంతో సంబంధాలు కొనసాగాయి. గుంటురు , విజయవాడ వచ్చినప్పుడు ఫోన్ చేసేవారు. చాల సందర్బాల్లో కలిసేవారు. కుటుంబం, కళాపరిషత్ గురించి అడిగేవారు. ఒక సందర్బంలో చెన్నై వెళ్లినప్పుడు వారి ఇంట్లోనే బస ఏర్పాటు చేయటం,వారితో కలసి గడపటం జరిగింది. తన కుమారుడు చరణ్ వివాహనానికి ఆహ్వానం పంపారు. వివాహానికి వెళ్లి వచ్చాం.గుంటూరులో పాడుతా తియ్యగా కార్యక్రమం మూడు రోజులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావాలని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. మూడు రోజుల పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. కొలుకొని ఇంటికి వస్తారని, ఎప్పటిలాగే కొంత ఆలశ్యమైనా ఆయన పాటలు వినే అవకాశం వస్తుందని ఆశించా.. కాని పిడుగులాంటి వార్త . ఆయన లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నా... ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి పదిలమే...
ఎస్పీ బాలసుబ్రమణ్యం చిలకలూరిపేటలో అనేకమంది కళాకారులకు సుపరిచితుడే. జాతీయ స్థాయిలో చిలకలూరిపేటలో నిర్వహించే కళానిలయం పోటీలకు ఆయన హాజరయ్యారు.


Post A Comment:
0 comments: