చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం 38వార్డులతో అతి పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడింది. 38 వార్డుల్లో 30వార్డులు గెలుపొంది వైఎస్సార్ సీపీ పాలక వర్గ బాధ్యతలు చేపట్టింది. ముందుగా కొత్త పాలక వర్గానికి, ఎన్నికైన కౌన్సిలర్లకు చిలకలూరిపేట న్యూస్ అభినందనలు తెలియజేస్తుంది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, స్థానికంగా వైఎస్సార్ సీపీ మున్సిపాలిటి పగ్గాలు చేపడటం శుభపరిణామమే. త్వరిత గతిన అభివృద్ది పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుందని, ప్రజా సమస్యలు పరిష్కారమవ్వటానికి ఈ మార్పు దోహదపడనుంది.
నూతన పాలకులు ఈ సమస్యలపై దృష్టి పెట్టండి...
అయితే నూతన పాలక వర్గానికి, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని కు అనేక సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. ఈ సమస్యలు ఇప్పటికప్పడే ఉద్బవించినవి కానప్పటికీ నూతన పాలక వర్గం అపరిషృ్తంగా సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
- చిలకలూరిపేట మున్సిపాలిటీలో అత్యంత ప్రధాన సమస్య తాగునీరే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉన్న మంచినీటి చెరువులు నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రస్తుతం రోజు మార్చి రోజు తాగు నీరు అందిస్తున్నా పలు ప్రాంతాలలో ఇప్పటికే ట్యాంకర్ నీళ్లే దిక్కు. గుంటూరు ఛానల్ నుంచి చిలకలూరిపేట తాగునీటి చెరువుల వరకు పైపులైన్ నిర్మాణం, పట్టణంలోని నూతన ఓవర్ హెడ్ ట్యాంకర్ల నిర్మాణం తదితర సమస్యలు పరిష్కారం కావటానికి అమృత్ నిధులే దిక్కు. మున్సిపాలిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే ఎమ్మెల్యే విడదల రజిని హామీ ఇచ్చారు. ఈ నిధులు విడదల అయ్యేలా కృషి చేయాల్సి ఉంది.
- పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన మురుగునీటి కాల్వలు శిధిలావస్థతకు చేరుకున్నాయి. ఇందువల్ల చిన్నపాటి వర్షానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధులు, కాలనీలు ముంపుకు గురౌతున్నాయి. వీటిని జాతీయ రహదారుల సంస్థ నిర్మించాల్సి ఉంది.
- పట్టణంలో ఉన్న పలు పార్కులు పచ్చదనం కొల్పయి కళావిహీనంగా మారాయి. పాత గాంధీపార్కుతో పాటు, ఎన్‌టీఆర్ కాలనీలోని బింగి రామ్మూర్తి పార్కులు అభివృద్దికి నోచుకోలేదు. దీంతో పాటు పలు కాలనీలో పార్కులు కనీసం ఉన్నట్లు ఆనవాళ్లు కూడా మాయమయ్యాయి.
- పట్టణంలో టౌన్‌హాలు, క్రీడామైదానం సమస్య ఎప్పటికి తీరటం లేదు. చిలకలూరిపేటలో ఎంతో మంది కళాకారులు ఉన్నా వారి కళాప్రదర్శనలకు టౌన్ హాలు లేకపోవటం గరనార్హం. నియోజకవర్గంలో క్రీడాకారులకు కొదవలేదు. ఈ నియోజకవర్గంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరిన క్రీడాకారులు ఉన్నా వారి క్రీడా ప్రతిభ మెరుగు పరచుకోవాటానికి కావల్సిన క్రీడా మైదానం ఇప్పటి కొరతగానే ఉంది.
- పట్టణంలోని ట్రాఫిక్ సమస్య జఠిలమౌతుంది. అక్రమలతో వీధులు కుచించుకు పోతున్నాయి.పెరిగిన జనాభాకు అనుగుణంగా వీధులు విస్తరించక పోవటంతో మరో సమస్య. పట్టణ పరిధిలోని 47 కాల్వలు అక్రమణలకు గురి అయినట్లు 10 సంత్సరాల కిందటే మున్సిపల్ అధికారులు నిర్ధారించారు. అక్రమణలు తొలగించటానికి గతంలో ప్రయత్నాలు జరిగినా రాజకీయాలతో ఆ ప్రయత్నం విఫలమైంది.
విలీన గ్రామల సమస్యలు ఇవే... త్వరలో



Post A Comment:
0 comments: