చిలకలూరిపేట:
ప్రతిభగల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు' కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశానికి ఈ నెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్ నరసింహరావు తెలిపారు. చిలకలూరిపేట మండలం మద్దిరాలలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2022-23. విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 4,397 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. కొత్త జిల్లాల వారిగా చూస్తే గుంటూరు జిల్లా నుంచి 843. మంది, బాపట్ల జిల్లా నుంచి 679 మంది, పల్నాడు జిల్లా నుంచి 2,875 మంది ప్రవేశ పరీక్షకు హాజరౌతారన్నారు. ఆరో తరగతిలో మొత్తం 80 సీట్లు ఉంటాయని, వీటిలో ప్రవేశానికి సంబంధించి ఈ నెల 30న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Post A Comment:
0 comments: