చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ
చిలకలూరిపేట:
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయవాది ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం విజయవంతంగా నిర్వహించి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి జెడిశీలం గార్ల నాయకత్వం లో చీరాల లో సోమవారం సాయంత్రం జరుగనున్న ప్రజా ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు నాడు బ్రిటీష్ పాలకులు విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో ఉద్యమించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోరాట పటిమ ను ఆదర్శంగా తీసుకుని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావలసిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ఈ కార్యక్రమ విజయం ఆవశ్యం అని అన్నారు ఎఐసిసి ఉపాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వ మాజీ మంత్రి వర్యులు ముకుల్ వాస్నిక్ తో పాటు అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనే చీరాల పేరాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందుకు గాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి బయలుదేరే కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు
---------------

Post A Comment:
0 comments: